24 February, 2026 | 5:57 PM

భిక్కనూర్ పీహెచ్‌సీలో అమ్మఒడి కార్యక్రమం

24-02-2026 04:12 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి గర్భిణీ స్త్రీలను ఆశా కార్యకర్తలు తీసుకొచ్చి రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు పరీక్షలు నిర్వహించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించి, ప్రతి గర్భిణీ మహిళ HPLC రక్త పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, MLHP ప్రశాంత్, హెల్త్ అసిస్టెంట్లు హేమలత, మంజుల, శ్యామల, హెల్త్ సూపర్వైజర్లు రాజమణి, సువర్ణ పాల్గొన్నారు.