24 February, 2026 | 5:39 PM

రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలి

24-02-2026 04:09 PM

వాంకిడి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించాలని లేకుంటే ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వాంకిడి ఎస్ఐ మహేందర్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం వాంకిడి మండలంలోని ఖమాన గ్రామంలో రోడ్డు భద్రత నిబంధనలపై ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యం చేరాలన్నారు. అలాగే వాహన పత్రాలు, హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీడ్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.