‘షూఆల్స్’తో అమోర్ ఆసుపత్రి ఒప్పందం
ఆర్థోపెడిక్ సంరక్షణలో పాదరక్షల పాత్రపై అధ్యయనం
హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): దక్షిణ కొరియాకు చెందిన హెల్త్- టెక్నాలజీ సంస్థ షూఆల్స్‌తో అమోర్ ఆసుపత్రి వ్యూ హాత్మక క్లినికల్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొరియన్ అధునాతన సాం కేతిక పరిజ్ఞానం, భారతీయ వైద్య నైపుణ్యాల కలయికతో నడక తీరు, శరీర భంగిమ, చలనశీలత, ఆర్థోపెడిక్ సమస్యల పరిష్కారంలో ‘ఫంక్షనల్ ఫుట్‌వేర్’ దోహదంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది.
ఈ అవగా హన ఒప్పందం ద్వారా కొరియాకు చెందిన ప్రత్యేక పాదరక్షల సాంకేతికతను భారతదేశంలో క్లినికల్ పరంగా పరిశీలించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా అమోర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ ‘ఆర్థోపెడిక్ స మస్యలతో బాధపడేవారిలో సుమారు 25 నుంచి 30 శాతం మంది సరైన పాదరక్షల వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది అన్నారు.
షూఆల్స్ సహకారంతో ఈ సాంకేతికతపై క్లినికల్ అధ్యయనం చేసి, అర్హులైన రోగులకు ఇది ఏ విధంగా ప్ర యోజనకరంగా ఉంటుందో పరిశీలిస్తామన్నారు. షూఆల్స్ సంస్థ తన ప్రత్యేక ‘మెడిచి యో వైబ్రేషన్ చిప్’ టెక్నాలజీని ఈ పాదరక్షల్లో పొందుపరిచింది. ఇది దక్షిణ కొరియా నిబంధనల ప్రకారం క్లాస్-2 మెడికల్ డివైజ్గా గుర్తింపు పొందడంతో పాటు, అమెరికా ఎఫ్డీఏ, యూరప్ సీఈ రిజిస్ట్రేషన్లను కలిగి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
షూఆ ల్స్ కో లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ లీ చెయోంగ్-గాన్ స్మార్ట్ వెల్‌నెస్, హెల్త్‌కేర్, ఫంక్షనల్ ఫుట్‌వేర్ కలయికను విస్తరించేందుకు భారతదేశం ఒక గొప్ప వేదిక. రెండు ఆసుపత్రుల అనుభవం భవిష్యత్ ఆవిష్కరణలకు పునాది అన్నారు.






