23 August, 2026 | 2:43 AM

డీఐఈవోల ఇష్టారాజ్యం

23-08-2026 01:14 AM

ప్రైవేట్ కాలేజీల అనుమతుల్లో పైకి రూల్స్.. లోపల ‘రేటు’!

  1. అఫిలియేషన్ నుంచి షిఫ్టింగ్ వరకు చేతివాటం 
  2. నకిలీ ఎన్‌వోసీల వ్యవహారంతో వెలుగులోకి

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్ బోర్డులో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతు లు, అఫిలియేషన్లు, ఎన్‌వోసీల తనిఖీల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల అమలు పేరు తో కొర్రీలు పెడుతూ ఆ తర్వాత సర్దుబాట్లకు తెరతీస్తున్నారన్న విమర్శలు ఉన్నా యి. పలువురు ఇంటర్మీడియట్ విద్యాధికారులు (డీఐఈవో)లు అఫిలియేషన్, కాలేజీల షిఫ్టింగ్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

కొందరు అధికారులు రూ.లక్షల్లో వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇస్తే నిబంధనలను పక్కనబెట్టి అనుమతులు మంజూరు చేస్తున్నారని, లేదంటే చిన్నచిన్న లోపాలను చూ పుతూ దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారని కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. బహి రంగంగా మాట్లాడేందుకు యాజమాన్యాలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి.  ఇటీవల వెలుగుచూసిన నకిలీ ఎన్‌వోసీల వ్యవహారంతో అధికారుల తనిఖీల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

సర్దుబాటు అయితే అంతా సాఫీ..

నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే చాలు డీఐఈవోల జేబులు గలగలే. వారు ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పాలి. తొలుత నిబంధనలన్నీ చెప్తారు. అది లేదు..ఇది లేదని కొర్రీలు పెడతారు. ఇక మా వల్ల కాదు.. మీకు ఏం కావాలో చెప్పండని ఏకంగా కాలేజీ యాజమాన్యాల నోటి నుంచి వచ్చేలా దారికి తెచ్చుకుంటారు.

అడిగింది ఇస్తే చప్పుడు చేయకుండా అన్నీ క్లియరెన్స్‌లు ఇస్తారనే ఆరోపణలున్నా యి. ఇక్కడ కాలేజీలు కరెక్ట్ అని చెప్పడంలేదు. అవి కూడా సరైనా నిబంధనలు పాటించడంలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పలువురు జిల్లా అధికారులు కాసులు దండుకుంటున్న పరిస్థితి ఉంది. 

జిల్లాల్లోని మొత్తం జూనియర్ కాలేజీలపైన డీఐఈవోలదే పెత్తనమే. అనుమతులు, తనిఖీల్లో వారి పర్యవేక్షణ ఉంటుంది. ఇదే వారికి కాసులు కురిపిస్తున్నాయి. ఇంటర్ బో ర్డు నిబంధనలు ప్రైవేట్ కాలేజీలకు శాపంగా మారితే డీఐఈవోలకు మాత్రం కాసుల వ ర్షం కురుపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డుకు జూనియర్ కా లేజీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇవి లేకుంటే పంట పండినట్టే..

కాలేజీల నిర్వహణకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు రావాలంటే ఆ కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూ వ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్, శానిటరీ సర్టిఫికెట్‌లతోపాటు బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అన్ని రకాల అనుమతులు వివిధ శాఖల నుంచి తప్పనిసరిగా ఉండాల్సిందే.

అప్పుడుగానీ ఆయా కాలేజీలకు ఆ విద్యాసంవత్సరం అడ్మిషన్లు చేపట్టడానికి ఇంటర్ బోర్డు అధికారులు గుర్తింపునివ్వరు. సరిగ్గా ఈ నిబంధనలే కొంత మంది డీఈవోలకు కాసు లు కురిపిస్తున్నాయి. దరఖాస్తుతోపాటు సమర్పించాల్సిన ధృవపత్రాల్లో కీలకమైనవి ఫైర్ ఎన్‌వోసీ, మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ, శానిటరీ సర్టిఫికెట్‌లు.

ఇందులో ఏ ఒక్కటీ లేకున్నా అనుమతి రావడం కష్టమే. 6-15 మీటర్లలోపు ఎత్తున్న భవనాలైతే అవసరమైన అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే మించితే అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ జారీ చేయాలి. ఈ తరహా కాలేజీలు ఎక్కువగా శాతం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 

రూ.లక్షల్లో డిమాండ్..

తనిఖీలు చేపట్టి అనుమతులివ్వాలంటే పలువురు అధికారులు రూ.లక్షల్లో అమ్యామ్యాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనుకోని పరిస్థితుల్లో కాలేజీ భవన యజమానితో మనస్పర్దలు వచ్చి నిర్దాక్ష్యణ్ణంగా రెంటల్ కాలేజీ బిల్డింగ్‌ను యాజమాన్యాలు ఖాళీ చేసి, వేరే మండలం లో ఆ కాలేజీను షిఫ్ట్ చేయాలంటే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తలనొప్పిగా మారుతోంది.

సరైనా సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో పరిశీలించకుండానే గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు పంపించిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిం దే. నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను సమర్పించిన కాలేజీల వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇద్దరు డీఐఈవోలకు  ఇటీవల ఇంటర్ బోర్డు సెక్రటరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

డీఐఈవోలకు సహకరిస్తున్న వారిలో ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు సైతం ఉన్నారనే ఆరోపణలున్నాయి. దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతు న్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇంటర్ బోర్డు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రతి ఏటా అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి, తనిఖీలను పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి.  

అనుమతి కోసం ఇవి తప్పనిసరి..

* వ్యాలీడ్ బిల్డింగ్ ఓనర్‌షిప్/రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్

* బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ సర్టిఫికెట్

* ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్/ ఫైర్ ఎన్‌వోసీ

* వ్యాలీడ్ ఎఫ్‌డీఆర్ (కార్పస్ ఫండ్)

* స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్

* శానిటరీ సర్టిఫికేట్

* టీచింగ్ స్టాఫ్ డాక్యుమెంట్లు

* ప్లే గ్రౌండ్ డాక్యుమెంట్లు