23 August, 2026 | 3:06 AM

కాపాడే చాన్స్ లేదు

23-08-2026 01:36 AM

మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు స్పష్టత

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడాను.. ఇప్పుడు అవకాశం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.  కొండా సుష్మిత పార్టీ గీత దాటి నేరుగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారని, అధిష్ఠానం ఆమెపై సీరియస్‌గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కాం గ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి హద్దులు దాటి మాట్లాడలేదని, వారిద్దరూ సీఎం గౌరవానికి భంగం కలిగించలేదని  పేర్కొన్నారు. కాగా టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.