8 March, 2026 | 3:32 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంప్యూటేషన్

15-12-2025 12:00 AM
  1. ప్రతి నలుగురు మధుమేహుల్లో ఒకరికి సమస్య
  2. ముందుగా గుర్తిస్తే వాస్క్యులర్ చికిత్సలతో కాలు సురక్షితం
  3. కిమ్స్ ఆస్పత్రిలో వైద్యనిపుణుల వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్నారని, వీరి కి కాళ్లలో పుళ్లు పడినా నొప్పి తెలియకపోవడంతో అవి తీవ్రమై చివరకు కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలిపారు. ప్రతి నలుగురు మధుమే హ బాధితుల్లో ఒకరికి ఈ తరహా సమస్య వస్తోందన్నారు. ముందుగా గుర్తించగలిగితే వాస్క్యులర్ చికిత్సలతో కాళ్ల ను కాపాడుకునే అవకా శం ఉంటుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొల్లినేని తెలిపారు.

ఈ అంశంపై ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) సదస్సులో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారు. డాక్టర్ వెంకటేష్ బొల్లినేని, బృందం మాట్లాడుతూ.. మధుమేహ బాధితులలో కాళ్ల తొల గింపును నివారించడం, తగ్గించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ము ప్పును ముందుగా గుర్తించడం, వాస్క్యులర్ చికిత్సలు చేయడం, ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, గాయాలు, మృదు కణజాలాలకు చికి త్సలు అందించడం, దీర్ఘకాలం పాటు పాదా ల సంరక్షణ ఎలా చేసుకోవాలో బాధితులకు చెప్పడం ముఖ్యం.

మధుమేహం ఉన్న ప్రతి నలుగురిలో తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి కాళ్లలో పుళ్లు ఏర్పడతాయి. వారికి స్పర్శ అంతగా తెలియకపోవడంతో గుర్తించరు. దీనివల్ల పుళ్లు ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కాళ్లు తొలగించాల్సి వస్తోంది. వాస్కులర్ సర్జ రీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. గ తం కంటే ఇప్పుడు ఎండోవాస్క్యులర్ విధానాలు, ఆధునిక రీకన్స్ట్రక్టివ్ టెక్నిక్లు, డెర్మల్ సబ్స్టిట్యూట్లు ఫలితాలు మెరుగుపడు తు న్నాయని ప్లాస్టిక్ సర్జన్ డా.శరత్ చంద్రరెడ్డి అన్నారు.