14-12-2025 12:38:46 AM
ఐఐటీ బాంబే ఎన్‌ఈసీ ఛాలెంజ్‌లో అఖిల భారత 7వ ర్యాంక్
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్ (ఎస్‌ఎంఈసీ) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో డిసెంబర్ 10 నుంచి 12 వరకు నిర్వహించిన నేషనల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఛాలెంజ్ (ఎన్‌ఈసీ) 2025లో ఎస్‌ఎంఈసీ ఈ-సెల్ ఎలై ట్స్ టీమ్ అఖిల భారత స్థాయిలో 7వ ర్యాం క్ సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల టీమ్స్ పోటీలో పాల్గొనగా, వాటిలోంచి టాప్ 50 కాలేజీలను మాత్రమే ఐఐటీ బాంబేలో జరిగిన గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించారు.
ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీలో టాప్10లో స్థానం సంపాదించిన ఏకైక దక్షిణ భారత కాలేజీగా సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజ్ నిలిచింది. ఈ-సెల్ ఎలై ట్స్ చైర్మన్ గడ్డె రామకృష్ణ నాయకత్వంలో, ఫ్యాకల్టీ అడ్వైజర్ డా. గౌతమ్ మమిడిశెట్టి మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. బిజినెస్ మోడల్ కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్, స్టార్టప్ ఎక్స్పోలు, స్టార్టప్ మోడల్ పిచింగ్ వంటి పలు దశల్లో, నిపుణులైన జ్యూరీల మూల్యాంకనానికి లోనై, అన్ని రౌండ్లలో చూపిన సమగ్ర ప్రతిభ ఆధారంగా ఈ అఖిల భారత 7వ ర్యాంకును దక్కించుకున్నారు.
కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. కె. రవీంద్ర మాట్లాడుతూ.. ఈ-సెల్ ఎలైట్స్ టీమ్ సాధించిన విజయం, ఆవిష్కరణలు, వ్యాపార దృక్ప థం, సామాజిక బాధ్యతలపై మా కళాశాల నిబద్ధతకు నిదర్శనం అన్నారు. చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వైస్ చైర్మన్ జి.చంద్రశేఖర్ యాద వ్ మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ డా. కె. రవీంద్ర ఈ-సెల్ ఎలైట్స్ టీమ్ను అభినందిస్తూ, కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువ చ్చినందుకు ప్రశంసలు కురిపించారు.