15-12-2025 03:17:54 PM
న్యూఢిల్లీ: వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 26 పైసలు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 90.64కి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. 2025లో 5.5 శాతం పడిపోయిందని, 2025 సంవత్సరంలో రూపాయి అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన ఆసియా కరెన్సీగా నిలిచింది. ఈ సంవత్సరం విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్ నుండి 18 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు.
వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం లేకపోవడంతో భారతీయ వస్తువులు మొత్తం 50% అమెరికా సుంకం రేటును ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు 7న 25% ప్రతికార సుంకం విధించగా, ఆ తర్వాత ఆగస్టు 27న అదనంగా 25% శిక్షాత్మక సుంకం విధించబడింది. ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం మధ్య రష్యా నుండి రాయితీ చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలను ప్రవేశపెట్టారు.
ఇటీవలి నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొత్త ఊపందుకున్నాయి. రూపాయి విలువ పడిపోవడంపై ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి బలహీనపడుతోందని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు బాగుంటే, రూపాయి విలువ పెరిగేదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బవంపై గానీ, ఎగుమతులపై గానీ రూపాయి విలువ పతనం ప్రభావం చూపడం లేదని, అందుకే తాను దాని గురించి ఆందోళన చెందడం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ చెప్పిన మరుసటి రోజే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.