24 April, 2026 | 1:23 AM

మద్దతు ధరకు పడరానిపాట్లు

24-04-2026 12:00 AM
  1. మొక్కుబడిగా మొక్కజొన్న కొనుగోలు
  2. ప్రైవేట్‌లో దళారుల దోపిడీ 
  3. పట్టించుకోని పాలకులు

కుబీర్, ఏప్రిల్ 2౩ (విజయక్రాంతి):  ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పంట పండించిన రైతులకు మద్దతు ధర పొందెందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మంజూరు చేసిన ఇంకా చాలా కేంద్రాల్లో అధికారికంగా కొనుగోలు చేపట్టకపోవడంతో పంట కళ్ళలో మొక్కజొన్న ధాన్యం భారీ ఎత్తున  వచ్చి చేరుతుంది. నిర్మల్ జిల్లాలో యాసంగిలో నిర్మల్, బైంసా, ఖానాపూర్, కుబీర్ లోకేశ్వరం, కుంటాల, నర్సాపూ ర్, సారంగాపూర్, దిల్వార్పూర్, సోన్, లక్ష్మణ్‌చందా, మాముడా, కడెం, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో 1,20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగినట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రైతులు పంటలకు పోసి నూర్పిడి చేసి ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో వికయించుకునేందుకు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను కొను గోలు కేంద్రాల వద్ద నిలువ చేశారు. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు అయినట్టు స్థానిక ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రకటించడం కొనుగోలు కేంద్రాలను హడావుడిగా ప్రారంభించడం జరిగినప్పటికీ కొనుగోలు మాత్రం చాలా కేంద్రాల్లో ఇప్పటికీ ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ఏజెన్సీల నిర్వహణలో రాజకీయాలు చోటుచేసుకోవడం స్థానిక సమస్యలు ఉండడంతో కొనుగోలు ఆలస్యం జరుగుతుంది.

తప్పని అవస్థలు.. 

నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న  కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లలో జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతున్న నామ మాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు గంటలకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 ధర క్వింటాలకు ప్రకటించగా బయట మార్కెట్లో రూ.1850 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలకు 550 తేడా ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని పంటను విక్రయించుకోవాలని నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న నిల్వలు పెద్ద ఎత్తున పెరుగుతున్న కూలీల కొరత ట్రాన్స్పోర్ట్ ఇతర కారణాల వల్ల కొనుగోలలో జాప్యం జరగడంతో రైతులు పంటలు కాపాడుకోవడానికి పట్టణాన్ని తిప్పలు పడుతు న్నారు. పంట కలంలో వేసిన పంటపై ఇటీవల కురిసిన వర్షాలు వడగళ్ల వాన పంటకు నష్టం కలిగిస్తుందని వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోలు చేపట్టాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

వర్షాలు పడి ఇబ్బంది పడుతున్నాం 

కుంటాల మండలంలోని ఓలా గ్రామం మాది. పంట కొనుగోలు కేంద్రంలో వేసి పది రోజులు అయింది. ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదు. వర్షాలు పడి ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మద్దతు ధర 2400 ప్రకటించడంతో మాకు గిట్టుబాటు అవుతుందని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ప్రతిరోజు ఇక్కడే ఉండి పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

భూమన్న రైతు ఓలా 

ప్రైవేట్‌లో రూ.1750 కొంటున్నారు

రైతులకు ఎప్పుడు కష్టాలే. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి ఎన్ని అవస్తులు పడాల. మొన్నటిదాకా ఎరువుల ఎరువుల కొరత. ఇప్పుడు కూలీలు హార్వెస్టర్ల కోరుతా. పెట్టుబడి రెట్టింపు అయింది. పండిన పంటలు బయ ట అమ్ముకుందామంటే దళారులు 1750 కొంటున్నారు. ప్రభు త్వ మద్దతు ధరకు వస్తే ఇక్కడ కొనుగోళ్ల జాప్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలి.             

 రాజన్న రైతు ఓలా