12 May, 2026 | 11:43 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

24-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమం సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్మల్ గ్రామీణ మండలం, డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాలలో విద్యార్థుల, పోషకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ పోషకులు, తల్లిదండ్రుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ సమావేశాల వల్లనే పాఠశాల ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. పాఠశాల ప్రహరీ గోడ సమస్య తొలగిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నీటి సౌకర్యానికై బోరు వేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిటిడిఓ అంబాజీ, డీఈవో భోజన్న, సిపిఓ జీవరత్నం, తహసిల్దార్ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు శైలజ, గ్రామసర్పంచ్, ఉప సర్పంచ్ లు  నవీన్, హరీష్, ఇతర అధికారులు, విద్యార్థుల పోషకులు పాల్గొన్నారు.