calender_icon.png 18 May, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

17-05-2025 09:10:21 PM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో శనివారం కేంద్ర ప్రభుత్వానికి, బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీని బీహార్ పోలీసులు అడ్డుకుని, అంబేద్కర్ హాస్టల్‌లో దళిత విద్యార్థులను కలవకుండా ఆపడం నిరసిస్తూ కార్యక్రమం నిర్వహించారు. మోడీ, నితీష్ కుమార్ లు రాహుల్ గాంధీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ దేశంలొ లేకుండా చేయాలనే దురుద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మతతత్వ బీజేపీ పార్టీకి త్వరలోనే దేశ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 

రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశానుసారం, జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ సెంటర్ లో ఎన్ డి ఏ ప్రభుత్వంలో  భాగస్వామ్యం అయినటువంటి జె డి యు బీహార్ రాష్ట్రప్రభుత్వ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు బాల గంగాధర్, ఆదర్శ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల మహేష్, క్రాంతి కుమార్, పాలేరు నియోజకవర్గ అద్యక్షులు కిరణ్, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సత్యం (నిప్పు), ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఖైజర్, ముదిగొండ మండల అద్యక్షులు నాగరాజు, ఖమ్మం పట్టణ యువజన నాయకులు ఆర్ కె నాయుడు, జితేందర్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.