calender_icon.png 18 May, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం..

17-05-2025 09:13:08 PM

రాజాపూర్: మండల కేంద్రానికి చెందిన గజ్జి నర్సింహులు కూతురు మౌనిక వివాహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ.10 వేల ఆర్దిక సహాయం చేశారు. శనివారం అభిమన్యు యువసేన నాయకులు వివాహ వేడుకలకు హాజరై ఆర్దిక సాయం అందజేశారు. అలాగే చెన్నవేల్లి గ్రామానికి చెందిన బోయ సత్యం అంత్యక్రియలకు రూ.5 వేలు ఆర్థిక సాయంను అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజాపూర్ మండల ఉపాధ్యక్షులు రాచమళ్ల యాదగిరి, మాజి ఎఎంసి డైరెక్టర్ అల్లే తిరుపతయ్య, నజీమ్ బేగ్, షాకేర్, శ్రీశైలం గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.