6 April, 2026 | 5:02 AM

హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడికి సన్మానం

06-04-2026 01:52 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 5 : ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యునిగా(రోడ్డు రవాణా,భవనాల శాఖ సహాయ ప్రభుత్వ న్యాయవాది) ఎన్నికైన మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్ ఫూల్ సింగ్ నాయక్ ను ఆల్ ఇండియా కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు, మహేశ్వర బాబులు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎక్స్క్యూటివ్ మెంబర్ గా గెలుపొందిన పూల్ సింగ్ నాయక్ ను అభినందించారు.