పెట్టుబడుల పేరుతో నిలువు దోపిడీ?
రూ.25 కోట్లు వసూలు చేసిన కీ’లాడీ’
వనస్థలిపురంలో వెలుగులోకి వచ్చిన భారీ మోసం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎల్బీనగర్, మార్చి 7 : రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, అధిక వడ్డీ ఆశ చూపించి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను టార్గె చేసిన ఓ మహిళ సుమారు రూ.25 కోట్ల వరకు వసూలు చేసి పరారైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కమలానగర్కు చెందిన బద్దం జ్యోతిరెడ్డి అనే మహి ళ స్థానికంగా పరిచయాలు పెంచుకుని రియల్ ఎస్టేట్లో పెట్టుబ డి పెడుతున్నానని చెప్పి పలువురి వద్ద నుం చి లక్షల్లో డబ్బులు సేకరించింది. రూ.10 వరకు వడ్డీ ఇస్తానని నమ్మించి కొంతకాలం వరకు వడ్డీ కూడా చెల్లించింది.
దీంతో నమ్మకం పెరిగిన బాధితులు లక్షల నుంచి కోట్ల వరకు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కొద్ది రోజుల వరకు అధిక వడ్డీలు చెల్లించిన జ్యోతిరెడ్డి తర్వాత ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమంటే రేపు, ఎల్లుండి అంటూ కాలం గడిపి చివరకు కమలానగర్లోని తన ఇంటిని ఇతరులకు విక్ర యించి, ఖాళీ చేసి పరారైంది. ఇంటికి వచ్చిన బాధితులకు ఇల్లు ఖాళీగా కనబడడంతో భోరుమన్నారు. సుమారు 35 నుంచి 40 మంది బాధితుల నుంచి 25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇల్లు విక్రయంలోనూ మోసమే..
జ్యోతిరెడ్డి తన ఇంటిని విక్రయించడంలోనూ మోసానికి పాల్పడింది. తన ఇంటిని ఒకరికి సేల్ అగ్రిమెంట్ చేసి, మరో వ్యక్తికి సేల్ డీడ్ చేయడంతో ఇటీవల ఇద్దరు వర్గా ల మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోలీసు లు రంగప్రవేశం చేసివారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతేకాకుండా ఎల్బీనగర్లోని ఒక జ్యువెలరీలో రూ.6 కోట్ల విలువైన బం గారం కొనుగోలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ముందస్తు పథకం ప్రకారం తన భర్త, చిన్న కుమార్తెను అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె దగ్గరకు పంపించిందని సమాచారం. జ్యోతిరెడ్డి చేసిన మోసాన్ని బాధితు లు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రూ.25 కోట్లకుపైగా మోసం చేసి పరారైన జ్యోతిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం..
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. జ్యోతిరెడ్డి చేసిన మో సంపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. రూ.46 లక్షల మోసం చేశారని ఒకరు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉందని, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, దర్యాప్తు చేస్తామని, రూ.25 కోట్ల తో పరారైనట్లు వస్తున్న ఆరోపణలపై ఇంకా సమాచా రం లేదని, త్వరలోనే నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని, అప్పుడే వివరా లు తెలుస్తాయని సీఐ మహేశ్ గౌడ్ వివరించారు.




