30 July, 2026 | 1:08 AM

అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు

30-07-2026 12:00 AM

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు 

తుంగతుర్తి, జులై 29అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో బుధవారం గుంటకండ్ల వేణుగోపాల్ రెడ్డి - ధనలక్ష్మిల నూతన ఇందిరమ్మ ఇల్లు ,గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ,కుటుంబ సభ్యులకు నూతన పట్టు వస్త్రాలు అందజేసి, నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కళ సాకారమవుతోందని పేర్కొన్నారు.

అర్హత కల్గిన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కన్నెబోయిన వెంకట బిక్షం నాగా రం బంగ్లా గ్రామ సర్పంచ్ బయ్యం సుజాత వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.