తుంగతుర్తిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి
బీఆర్‌ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి, జులై 29 :ఎంతో కాలంగా ఎదిరి చూస్తున్న ఫైర్ స్టేషన్, తుంగతుర్తి కి మంజూరి కావడం సంతోషం. అట్టి ఫైర్ స్టేషన్ ను తప్పనిసరిగా తుంగతుర్తి మండల కేంద్రం లోనే ఏర్పాటు చేయాలని బిఆర్‌ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.. తుంగతుర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గకేంద్రం. మరియు చుట్టపక్కల ఉన్న అన్ని మండలాలకు కూడ సెంటర్ పాయంటు ఉన్నది.
గతంలో కూడ ఇలాగే ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన మార్కెట్ యార్డు ను అప్పటి కాంగ్రెస్ పాలకులు వేరేచోటికి మార్చడం వ లన ఇప్పటికి కూడ తుంగతుర్తిమండలం అభివృద్ధి వెనుకబాటుకు గురౌతు వస్తుంది. అదేమాదిరిగా ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు కూడ ఫైర్ స్టేషన్ తిరుమలగిరి మార్చడం వలన తుం గతుర్తి మండల అభివృద్ధి మరింత వెనుకబాటుకు గురిఛే సిన వారావుతారని అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు వెంటనే ఫైర్ స్టేషన్ తుంగతుర్తి నియోజకవర్గకేంద్రం లో ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు తునికి సాయిలు. పోలేపాక సోమయ్య పాల్గొన్నారు






