calender_icon.png 18 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరుగుతోంది

18-07-2025 01:13:45 AM

సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): హెచ్‌సీఏ లో జరిగిన అవకవకలపై విచారణ జరుగుతోందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఎవరు అనితికి పాల్పడినా బయటపడుతుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో స్పోర్ట్స్‌కు రూ. 350 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రూ. 800 కోట్లు కేటాయించిం దని తెలిపారు. తెలంగాణ నీటిని ఏపీకి దోచి పెట్టిందే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆరోపించారు.

గురు వారం గాంధీభవన్‌లో మాట్లాడారు. నదీ జలాలపై ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు బాహటంగానే మాట్లాడిన తర్వాత ఇంకా దాపరికం ఎక్కడిదని ప్రశ్నించారు.  రేవంత్‌రెడ్డితో మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని హితవు పలికారు. ఎమ్మెల్సీ కవిత ఫ్రస్టేషన్‌లో ఉందన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీది గడీల పాలన అయితే కాంగ్రస్‌ది ప్రజాపాలన అని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావులు ఇక ఎర్రగడ్డ ఆసుపత్రికేననిఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి దోచుకున్న డబ్బంతా కక్కాల్సిందేనని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ప్రతిపక్షాలు ఔట్ అయ్యాయని పేర్కొన్నారు.