calender_icon.png 18 July, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచాలి

18-07-2025 01:09:44 AM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జులై 17 (విజయక్రాంతి): జిల్లా లో ఆయిల్ ఫామ్ పంటల విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మం దిరంలో ఆయిల్ పామ్ పంటల సాగుపై సం బంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథ కంలో భాగంగా జిల్లాకి 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకి నీటి వసతి ఉన్న రైతులను గుర్తించి, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు.

చిన్న, సన్నకారు రైతులను ఉపాధిహ మిలో అరులైన రైతులను గుర్తించి పామ్ ఆయిల్ పంటపై అవగాహనా కల్పించాలని సూచించారు. భారతదేశ వ్యవసాయ రంగం లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, తదనుగుణంగా రైతులు అధునాతన పంటలను సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ పంటల సాగు రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందన్నారు.

యిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకం తో పాటు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తుంది అన్నారు. ఆయిల్ పామ్ పంటకు అనుబంధంగా ఇతర పంటలను కూడా పండించవచ్చునని అన్నారు. ఇతర పంటలతో పోల్చితే ఆయిల్ పామ్ సాగు తక్కువ పెట్టుబడి, తక్కువ ఎరువులు, తక్కువ కూలీలు అవసరమవ్వడమే కాకుండా, చీడపీడల ముప్పు కూడా తక్కువగా ఉండి, లాభాలు కూడా అధికంగానే ఉంటాయన్నారు. పంట ప్రారంభం నుంచి మూడు సంవత్సరాల పంట నిర్వహణకు అవసరమయ్యే అన్ని అంశాలలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

అధికారులంతా మండలాల వారీగా రైతు వేదికలలో రైతు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఆయిల్ పామ్ పంటల సాగు వల్ల కలిగే లాభాలను వివరించాలని ఆదేశించారు. రైతులకు ఆయిల్ పామ్ పంటల సాగు పై ఎటువంటి అనుమానాలు ఉన్న నివృత్తి చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు గుంతలను తవ్వించే కార్యక్రమం చేపట్టాలన్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు ఆయిల్ పామ్ పంటల విస్తీర్ణం పెంచేందుకు సహకారం అందివ్వాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టర్ ఉద్యాన దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఇన్ చార్జి డిఆర్డివో శ్రీనివాస్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, ప్రియునిక్ కంపెనీ డీజీఎం, క్షేత్రస్థాయి ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.