14 March, 2026 | 2:43 AM

ఎల్పీజీ సిలిండర్లపై సర్కార్ నజర్

14-03-2026 01:42 AM

కృత్రిమ కోరతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు 

నిలిచిన ఓటీపీ సేవలు 

నిర్మల్, మార్చి 13 (విజయక్రాంతి): పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కారణంగా చమురు రవాణా పై ప్రభావం పడిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల సరఫరా పై ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యం త్రాంగం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కోరుతా లేదని ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్ల కోసం ప్రజలు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారు.

ప్రస్తుతం గురు అవసరాలతో పాటు వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునే సిలిండర్ కోరుతా లేనప్పటికీ యుద్ధం ఇలాగే సాగితే భవిష్యత్తులో సిలిండర్ దొరకదేమనన్న భయం ప్రజలను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మల్ బైంసా ముధోల్ బాసర్ ఖానాపూర్ తత్తర ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ బుక్ చేసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 18 ఏజెన్సీలు ఎల్పిజి గ్యాస్ సరఫరా చేస్తున్నారు. మొత్తం 2,51, 785 సిలిండర్లు ఉండగా, ఇందులో వాణిజ్య సిలిండర్లు 10,000 వరకు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

ప్రభుత్వం సిలిండర్లపై ఇటీవలే ఎల్పిజిపై 60 రూపాయలు వాణిజ్య సిలిండర్‌పై 100 రూపాయలు ధర పెంచింది. యుద్ధం కారణంగా కొడతా ఏర్పడితే ఈ ధరలు పెరుగుతాయని భావిస్తున్న ప్రజలు వ్యాపారులు ముందస్తుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాపార దుకాణంలో హోటల్లు లాభాలు వెల్డింగ్ మిషన్లు. విద్య సంస్థలు, హాస్టల్లు తదితర ప్రాంతాల్లో సిలిండర్ వినియోగం అధికంగా ఉంటుంది 

ఓటీపీ రాక అవస్థలు..

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆయా ఏజెన్సీల కనెక్షన్ల ఉన్న నియోజకవర్గాలు సిలిండర్ పొందేందుకు పడరాన్ని కష్టాలు పడుతున్నా రు. జిల్లా వ్యాప్తంగా 18 ఏజెన్సీలు గతంలో గ్రామాలకు వెళ్లి సిలిండర్లను ఓటీపీ సా యంతో అక్కడే పంపిణీ చేసేవారు. ప్రస్తు తం కస్టమర్లు సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటిపి నంబర్ సర్వర్ కారణంగా రావడం లేదు. దీంతో సిలిండర్ల సరఫరా ఇంటికి చేరడం లేదు.

కొందరు ఎల్పిజి గ్యాస్ ను వాణిజ్య అవసరాల కోసం వినియోగించడం వల్ల కొరత ఏర్పడుతుంది. అయితే రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ సిలిండర్ వాహనం నచ్చితే అక్కడికి ప్రజలు పరుగు తీస్తున్న ఆన్లైన్లో సర్వర్ ప్రా బ్లం కాదనంగా ఒకరిద్దరికి మాత్రమే సిలిండర్లు చేతికి అందగా మిగతావారు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలు 25 రోజులు గ్రామీణ ప్రాం తాల్లో 45 రోజులు దాటిన వారికి సిలిండర్ మంజూరు చేసేవారు 

అక్రమనీయులపై దాడులు..

నిర్మల్ జిల్లాలో సిలిండర్ కొడత లేకుండా జిల్లా యంత్రాంగం ముంద స్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డీఎస్‌ఓ రాజేశ్వర్ డిఎం స్ సుధాకర్ ఆధ్వర్యంలో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. గృహ అవసరాలకు వినియో గించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్న దుకాణాలపై దాడులు చేసి శుక్రవారం ఒక్కరో జే 19 సెమినర్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీలో స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేస్తున్నారు. సిలిండర్లను అధిక ధరకు విక్రయించిన అక్రమ సరఫరా చేసిన నిలువ ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే సిలిండర్ కొత్త పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ చర్యలు ఏమిరకు ప్రయోజనం ఇస్తాయో వేచి చూడాల్సిందే.