సొంత ఊరుపై ఎన్నారై మమకారం
17-09-2026 | 05:05am
రూ.కోటితో వైకుంఠ మహా ప్రస్థానం నిర్మాణం
నిర్మల్, సెప్టెంబర్ 16 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలం జాం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఏలేటి అజయ్ రెడ్డి(Eleti Ajay Reddy) తన స్వగ్రామంపై ఉన్న అభిమానంతో, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏలేటి వైకుంఠ మహాప్రస్థానాన్ని నిర్మించారు. సుమారు కోటి రూపాయలతో గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా మహాప్రస్థానం(Mahaprasthanam) నిర్మించినట్లు అజయ్ రెడ్డి తెలిపారు.
ఈ ప్రస్థానాన్ని ఎన్నారై ఏలేటి అజయ్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.స్వగ్రామంపై అభిమానంతో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా వైకుంఠ మహాప్రస్థానం(Vaikuntha Mahaprasthanam) నిర్మించి అందించడం గ్రామస్తులు(Villagers) వారిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.