02-02-2026 12:00:00 AM
కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
పూర్తి వేతనం చెల్లింపు
నిజామాబాద్ ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): విధి నిర్వహణలో గంజాయి ముఠా ఘాతుకానికి గత నెల 23వ తేదీ సాయంత్రం బలమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూన్నా సౌమ్య హైదరాబాద్ లో నీ నిమ్స్ లో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పొరుగు జిల్లా నుండి గంజాయి అక్రమ రావణ సాగిస్తున్న గంజాయి మాఫియా ముఠా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో.. సౌమ్య పై దుండగులు దాడికి తెగబడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారుతో ఆమెను ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. గంజాయి ముఠా పాల్పడిన ఘాతుకంలో సౌమ్య తీవ్రంగా గాయపడగా ఆమె మూత్రపిండాలు, ప్లీహం, కాలేయం దెబ్బతినడంతో ప్రాథమికంగా నిజామాబాద్ లో ఆమెకు చికిత్స అందించినప్పటికీ మెరుగైన చికిత్సకై హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
నిమ్స్ వైద్యులు శ్రమించి చికిత్స అందించినప్పటికిని పూర్తిగా దెబ్బతిన్న అవయవాల పరిస్థితి మెరుగుపడలేదు. గత 23వ తేదీ శనివారం నుండి వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య శనివారం రాత్రి తురుశ్వాస విడిచారు. సౌమ్య తుదిశాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. చిరు వ్యాపారం చేసే సౌమ్య కుటుంబానికి అండగా నిలుస్తుంది అనుకున్న కూతురు అధిలోనే గంజాయి ముఠా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. సౌమ్య తండ్రి సాయిలు తల్లి చంద్రకళ నిత్యవసర సరుకుల చిన్న కొట్టు నడుపుతూ సామాన్య జీవితం గడుపుతున్నారు. తమ్ముడు శ్రావణ్ డిగ్రీ పూర్తి చేసి ఎస్త్స్ర పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
సౌమ్య ప్రాణత్యాగం ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచిందని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సూపర్డెంట్ మల్లారెడ్డి కొనియాడారు మాదకద్రవ్యాల నిర్మూలనలో ఆమె చూపిన ధైర్య సాహసం మరువలేనిదని కొనియాడారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆమె అంతక్రియలను అధికారికంగా పోలీసు గౌరవ వందనంతో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాల మేరకు గాజుల సౌమ్య అంత్యక్రియలు ఆమె స్వస్థతలమైన మోస్త్ర గ్రామంలో జరిగాయి. సౌమ్య అంతక్రియల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుంభాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా తో పాటు ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్ వరకు వేతనం చెల్లించరా నున్నట్టు ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ఎక్సైజ్ ఉద్యోగుల భద్రతకై పూర్తి చర్యలు తీసుకోవడంతో పాటు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్ర మండల కేంద్రంలో కానిస్టేబుల్ సౌమ్య మృతదేహానికి అంతక్రియలు నిర్వహించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రాష్ట్ర జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠి సి పి సాయి చైతన్య హాజరై సౌమ్య మృతదేహానికి నివాళులర్పించారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి బాధాకరం. సంతాపం ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఎక్సైజ్ కానిస్టేబుల్ సామ్య మృతి చెందడం బాధాకరమని ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన సంతాపం ప్రకటించారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేసిందని చికిత్స పొందుతూ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మత్తు పదార్థాల రావణ, వినియోగంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని సౌమ్య మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబాన్ని ప్రభుత్వం విధాలుగా ఆదుకుని అండగా నిలుస్తుందని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కార్యకులైన గంజాయి ముఠాపై ఉక్కు పాదం మోపాలి. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. విధి నిర్వహణలో ప్రాణాపాయ స్థితికి చేరుకొని చావు బతుకులతో పోరాడుతూ తుది శ్వాస విడిచిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ సంతాపం తెలిపారు ఈ సంఘటన తనను దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గంజాయి ముఠా సౌమ్య పై కారూ తో ఢీ కొట్టి అత్యాయత్నానికి పాల్పడడం ఆయన తీవ్రంగా ఖండించారు. మత్తు పదార్థాల అక్రమ రావణాసురుల పట్ల ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని. సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.