మానవత్వానికి మానని గాయం
కుమ్మెర ఘటనపై తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కన్నీటి ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): ‘పశువులు సిగ్గుపడేలా కాళ్లతో తన్ని, పసికూనతోపాటు రాజ్యాంగాన్ని ఖననం చేసినారు కదా’ అని కుమ్మెర ఘటనపై బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంక ర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ అంబేద్కర్ సెం టర్‌లో కుమ్మెర బాధితుల దీక్షా శిబిరంలో బాధితురాలైన తల్లి మౌనికను జూలూరు గౌరీశంకర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సర్వసత్తాక గణతంత్ర కులాతీత, మతాతీత జన రాజ్యాంగమా.. ఈ ప్రవేశిక ఆ పాపతో పాటు పం పించేయ్ అని నిరసనను వ్యక్తం చేశారు. మానవత్వానికి మానని గాయం చేసిన కుమ్మెర లాంటి ఘటనలు తిరిగి పునరావృ తం కాకూడదని కలత చెంది కన్నీళ్ళతోనే రాస్తున్నామని పేర్కొన్నారు.
వేయి పడగలు విప్పి పగతో బుస కొట్టే ఆదిపత్య కొమ్ములను విరిచేందుకు ‘వెనుకబడిన కులాలు -వెంటాడే కలాలై ‘ పదునెక్కుతాయని, బడుగుల యుద్ధకావ్యాలను ఆవిష్కరిస్తాయని కవితాత్మకంగా జూలూరు పేర్కొన్నారు. దీక్షా శిభిరంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అద్యక్షులు వనపట్ల సుబ్బయ్య, పఖ్యాత రచయిత రమేష్‌బాబు, సామాజిక ఉద్యమ కారులు ఎదిరెపల్లి కాశన్న, లంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్, లంగాణ అరసం రాష్ట్ర నాయకులు కల్వకోల్ మద్దిలేటి, పార్థసారథి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.




