15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

10 నెలల చిన్నారికి కొత్త జీవితం

26-02-2026 01:56 AM

యశోదలో అరుదైన చికిత్స

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు “అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా” అనే అరుదైన ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న 10 నెలల వయసున్న చిన్నారికి (మాస్టర్ ఎం. ఖాదర్ అర్మాన్)కు అత్యాధునిక “హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్‌” మార్పిడి చేసి కొత్త జీవితాన్నిచ్చారు.

యశోద హాస్పిటల్స్- సోమాజిగూడ, సీనియర్ హేమాటో-ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్. అశోక్ కుమార్ పిళ్ళు మాట్లాడుతూ.. “కర్నూల్ జిల్లా, నందవరం కి చెందిన ముళ్ళ ఖాజా, రేష్మే ల 10 నెలల వయసున్న చిన్నారి (మాస్టర్ ఎం. ఖాదర్ అర్మాన్) నిరంతరం తక్కువ ప్లేట్‌లెట్స్ కౌంట్ నిర్దారణతో గత నెల డిసెంబర్ 26, 2025న తీసుకువచ్చారు.

ఆ బాబుకి పుట్టుకతో వచ్చే “అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా” ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఏకైక నివారణ చికిత్స అలోజెనిక్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడే అని తల్లిదండ్రులైన ముళ్ళ ఖాజా, రేష్మే లకు వివరించడం జరిగింది. వారి ఆమోదంతో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్‌ను మొదలు పెట్టి, పూర్తిగా సరిపోలిన దాత అందుబాటులో లేనందున, పిల్లడి తండ్రిని అంచనా వేసి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ దాతగా ఎంపిక చేశాం.

ఈ 10 నెలల వయసున్న బాబుకి పితృ మూల కణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ జనవరి 8, 2026న విజయవంతంగా నిర్వహించాం. వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో, పిల్లవాడు స్థిరంగా కోలుకున్నాడు’ అని చెప్పారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ, యూనిట్ హెడ్, డాక్టర్. ఎస్. ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.