calender_icon.png 9 December, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు

09-12-2025 07:19:07 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. అనంతరం ముగింపు వేడుకల్లో తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆనంద్ మహీంద్రా, చిరంజీవి, దువ్యూరి సుబ్బారావు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని, ప్రజలు కేంద్రంగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు.

దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్ రూపొందించిన సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు ఆనంద్ మహేంద్ర అభినందనలు తెలిపారు. యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్ గా ఉండాలని మొదట ముఖ్యమంత్రి తనన్ను అడిగారని, ఇప్పటికే టెక్ మహేంద్ర యూనివర్సిటీకి ఛైర్మన్ గా ఉన్నందున వద్దని చెప్పినన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాలు, విజన్ విన్నాక తిరస్కరించలేకపోయానని, యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్ గా ఉండటం నా అదృష్టం అని మహీంద్రా పేర్కొన్నారు.