calender_icon.png 9 December, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మున్నూరు కాపు ఎన్నికలకు కాపులు పెద్దఎత్తున పాల్గొనాలి..

09-12-2025 07:17:07 PM

సర్దార్ పుట్టం పురుషోత్తం

శామీర్ పేట్: మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు ఎన్నికలకు జిల్లాలోని మున్నూరు కాపులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోతమ రావు పటేల్ శామీర్ పేట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికలు అలియబాద్ మున్సిపాలిటీ అలియబాద్ చౌరస్తాలోని శుభం గార్డెన్ లో జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆ తర్వాత భోజనం 1.00 గంటలకు విజయోత్సవ సభ ఉంటుందని చెప్పారు. విజయోత్సవ సభలో జిల్లా రాష్ట్ర మున్నూరు కాపు ప్రముఖులు పాల్గొంటారని సర్దార్ తెలిపారు.

సమావేశం జిల్లా గౌరవ అధ్యక్షులు మామిండ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తారాని తెలుపుతూ ఎన్నికల నిర్వాహన రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఎన్నికల బాధ్యులు ఇందూరి తిరుపతి పటేల్, నిర్వహిస్తారని తెలిపారు. విజయోత్సవ సభ విజయవంతం కొరకు జిల్లాలోని రాష్ట్ర పదాధికారులు, జిల్లా ముఖ్య నాయకులు, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు కృషి చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో కర్ర వెంకన్నా పటేల్ రాష్ట్ర కార్యదర్శి, పోతాంశెట్టి వెంకటేశ్వర్లు పటేల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఆకుల సత్యనారాయణ పటేల్ రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి, గొనె శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి, వేల్పుల శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర నాయకులు, శామీర్ పేట్ అధ్యక్షులు చాట్ల నారిసింగ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.