18 August, 2026 | 1:44 AM

చాంపియన్లుగా అనన్య, సంయుక్త

18-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 17 : రెండవ హెచ్‌పీఆర్‌సీ ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్ పోటీల్లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ రైడర్లు సత్తా చాటారు. షో జంపింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ హెచ్‌పీఆర్‌సీకి చెందిన అనన్య గుప్తా, సంయుక్త విజేతలుగా నిలిచారు. షో జంపింగ్ (60 సెం.మీ) అండర్ 14 విభాగంలో అనన్య గుప్తా (హెచ్‌పీఆర్‌సీ)అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ కేటగిరీలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. మోక్ష (రాయల్ కాబల్లో క్లబ్) రెండో స్థానంలోనూ, గురజాడా అమృత వర్షిణి(ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్) మూడో స్థానంలోనూ, కొరి వివాన్(ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్) నాలుగో స్థానం లోనూ నిలిచారు.

షో జంపింగ్ (60 సెం.మీ) ఓపెన్ విభాగంలో సంయుక్త లక్ష్మి వానుపల్లి (హెచ్‌పీఆర్‌సీ), అబ్దుల్ మన్ (రాయల్ కాబల్లో క్లబ్) రెండో స్థానంలోనూ, గౌతమ్ సంజయ్ సుజనాని(హెచ్‌పీఆర్‌సీ) మూడో స్థానంలోనూ నిలిచారు.షో జంపిం గ్ (80 సెం.మీ) చిల్డ్రన్ 2 కేటగిరీలో ధృవ పోతినేని (అశ్వ కలెక్టివ్), అయాన్ వర్మ నడింపల్లి (హెచ్‌పీఆర్‌సీ) రెండోస్థానం దక్కించుకున్నారు.షో జంపింగ్(80 సెం.మీ) ఓపెన్ విభాగంలో మహ్మద్ హాషమ్( అశ్వ కలెక్టివ్), పెనుముచ్చు అర్నవ్ (ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్), కొరి వివాన్(ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

షో జంపింగ్ (90 సెం.మీ) చిల్డ్రన్ 1 కేటగిరీలో పెనుముచ్చు అర్నవ్ (ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్) అగ్రస్థామంలోనూ, సంయుక్త లక్ష్మి వామపల్లి (హెచ్‌పీఆర్‌సీ) రెండో స్థానం సాధించారు. షో జంపింగ్ (90 సెం.మీ) ఓపెన్ కేటగిరీలో పెనుముచ్చు అర్నవ్ (ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్), మహ్మద్ అమీర్ షెహనవాజ్(హెచ్‌పీఆర్‌సీ), రాజీవర్ సింగ్(ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్) వరుసగా తొలి మూడు స్థానా ల్లో నిలిచారు. విజేతలకు శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి ట్రోఫీలు అందజేశారు.