ఆయుష్ శెట్టి సంచలనం
- వరల్డ్ నెం.1 ప్లేయర్‌కు షాక్
- సింధు శుభారంభం
- ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
నూఢిల్లీ, ఆగస్టు 17 : సొంతగడ్డపై జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం ల భించింది. పురుషుల సింగిల్స్, మహిళల సిం గిల్స్, మహిళల డబుల్స్‌లో శుభారంభం దక్కింది. ముఖ్యంగా పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృ ష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ షి యుకి(చైనా)కి షాకిచ్చాడు. తొలిసారి ఈ టోర్నీ ఆడుతున్న ఆయుష్ చైనా ప్లేయర్‌కు చుక్కలు చూపించాడు.
గం టా 13 నిమిషాల పాటు హోరాహోరీగా సా గిన పోరులో ఆయుష్ 21- 13 21 స్కోరుతో షియుకిపై విజయం సా ధించాడు. తొలి గేమ్ ఆరంభం నుంచే అద్భుతమైన స్మాష్‌లతో వరుసగా పాయిం ట్లు సాధించాడు. తర్వాత రెండో గేమ్‌లో షి యుకి పుంజుకుని స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆయుష్ ప్ర త్యర్థికి అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒక దశలో 17 భారీ ఆధిక్యంలో నిలిచి సునాయాసంగా విజయం సాధించే లా కనిపించాడు.
కానీ చైనా షట్లర్ అద్భు తంగా పుంజుకుని ఆధిక్యాన్ని తగ్గించాడు. చివరికి ఆయుష్‌దే పైచేయిగా నిలిచింది. మ రోవైపు మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సింధు 21- 21- తేడాతో సోఫియా నోబెల్ (ఐర్లాండ్)ను ఓడించింది. తొమ్మిదో సీడ్ అయిన సింధు.. తొలి గేమ్‌ను సునాయాసంగా సొంతం చే సుకుంది. ప్రపంచ 141వ ర్యాంకు ప్లేయర్ అ యిన సోఫియా రెండో గేమ్‌లో పోరాడినా సింధు అవకాశం ఇవ్వలేదు. అలాగే మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ జాలీ జంట తొలి రౌండ్‌లో ఈజీ విక్టరీ కొ ట్టింది. ఈ జోడీ వరుస గేమ్స్‌ల్లో 21 21- తేడాతో పౌలా-లూసియా (స్పెయిన్)ని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్ జంట కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.






