18 August, 2026 | 1:15 AM

చరిత్ర సృష్టించిన జడేజా

18-08-2026 12:00 AM
  1. టెస్టుల్లో 350 వికెట్లు,4 వేల పరుగులు
  2. కపిల్‌దేవ్ సరసన స్టార్ ఆల్‌రౌండర్

గాలె, ఆగస్టు 17 : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడే జా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్లను పూర్తి చేసు కున్నాడు. అలాగే 4 వేలకు పైగా పరుగులు, 350 వికెట్లు తీసిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మూడోరోజు జడేజా ఈ ఘనత సాధించాడు.శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా,కేశర నువంతలను ఔట్ చేయడం ద్వారా 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. త ద్వారా ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.

గతంలో అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్ (537), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఈ మైలురా యి అందుకున్నారు.టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు జడేజా 4,095 పరుగులు చేశాడు. 350 వికెట్లతో పాటు 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గానూ ఘనత సాధించాడు. కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్), డేనియల్ వెటోరి(న్యూజిలాండ్) మాత్రమే జడేజా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. రంగన హెరత్(శ్రీలంక) 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. డేని యల్ వెటోరి(న్యూజిలాండ్) 362 వికెట్లతో జడేజా కంటే ముందున్నారు.