15 June, 2026 | 1:55 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

ఇక మెగా.. విక్టరీ మాస్ సెలబ్రేషన్

27-12-2025 01:51 AM

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి మ్యాసీవ్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు.

ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్ క్రియేట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయబోతోందని టీమ్ తెలిపింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.