calender_icon.png 27 December, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజుగారి పెళ్లిరో.. ఊరూవాడ లొల్లిరో...

27-12-2025 01:52:41 AM

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా రెండోపాట ‘రాజుగారి పెళ్లిరో..’ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు.

‘టాలీవుడ్డు టీజే కొట్టు.. బాలీవుడ్డు బట్టలు కట్టు.. హాలీవుడ్డు బడ్జెట్టు పెట్టు.. ట్టు ట్టు ట్టు.. అంబరాన డ్రోనులు చుట్టూ.. బంగారాల ప్లేటులు పెట్టు.. అంబానీయే కుళ్లుకునే ట్టు.. ట్టు ట్టు ట్టు.. సంగీతు పాటలు.. హల్దీలో ఆటలు.. ఇన్‌స్టాలో ఫొటోలు పెట్టు పెట్టు పెట్టు.. ఎంతో ఘనంగా.. ఇంత ధనంగా.. అనగనగనగా.. రాజుగారి పెళ్లిరో.. ఊరూవాడ లొల్లిరో.. రాదు ఇది మళ్లీరో.. ఎంజాయ్ ఫుల్లీరో..’ అంటూ సాగుతోందీ పాట. మిక్కీ జే మేయర్ స్వరపర్చిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సమీరా భారద్వాజ్ ఆలపించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న విడుదల కానుంది.