23 May, 2026 | 4:34 PM

తుంగతుర్తిలో మంత్రి కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

23-05-2026 04:02 PM

కేక్ కట్ చేసి రోగులకు బట్టర్ మిల్క్, అరటిపండ్లు పంపిణీ

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిమండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ యువ నాయకులు దొనకొండ రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెయిన్ రోడ్డుపై బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బట్టర్ మిల్క్, అరటిపండ్లు పంపిణీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.