calender_icon.png 11 November, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కుసూటి మనిషి అందెశ్రీ

11-11-2025 12:00:00 AM

తెలంగాణ రచయితల వేదిక ప్రతినిధుల నివాళి

కామారెడ్డి, నవంబర్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తెరవే తో అందెశ్రీకి ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ రచయితల వేదిక సంఘం అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. అందే శ్రీ మృతి పట్ల నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత తెరవే నిర్వహించిన మొదటి మహాసభలు కామారెడ్డి లోని కర్షక్ బిఈడి కళాశాలలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అందెశ్రీ హాజరయ్యారు. ఇక్కడి సాహితీ వ్యక్తులతో ఎంతోసేపు గడిపారు. సాహితీవేత్తలు అందరితోనూ మంచి సాన్నిహిత్య సంబంధాలు అందెశ్రీకి ఉన్నాయి. రాష్ట్ర తెరవే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అందెశ్రీ హాజరయ్యే వారు.

అదేవిధంగా బాసరకు ఎప్పుడు వెళ్ళినా కామారెడ్డి దగ్గర ఆగేవారు ముఖ్యంగా సుమిత్రా నంద్  గారి ఇంట్లో చిన్న మల్లారెడ్డిలో కాసేపు గడిపి వెళ్లేవారు, అందెశ్రీ  ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ప్రతినిధులు తెలిపారు. అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెరవే కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్, ప్రధాన కార్యదర్శి అల్లి మోహన్ రాజ్ , డాక్టర్ జి లచ్చయ్య,  ఎనిశెట్టి గంగా ప్రసాద్, పీతాంబర్, సూరారం శంకర్, మేకల రామస్వామి, నవీన్ రెడ్డి, రవీందర్, భాను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అందే శ్రీ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు 

 మట్టి మనిషి ఇక లేరు అనే విషయాన్ని కామారెడ్డి సాహితీవేత్తలు, విద్యావేత్తలు తట్టుకో వడం లేదు. కామారెడ్డికి ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో ఆప్యాయతగా మాట్లాడే ప్రముఖ కవి అందెశ్రీ ఆకాలమరణం పట్ల కామారెడ్డిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. టి పి ఆర్ టి యు అధ్యక్షులు మనోహర్ రావు, లక్ష్మీరాజం, సీనియర్ నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్, ప్రముఖ జర్నలిస్ట్ ఇంద్రసేనారెడ్డి, ప్రముఖ వైద్యులు పుట్ట మల్లికార్జున్, పలువురు మహిళా ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. అందెశ్రీ తో ఉన్నా అను బంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఒక ఇంటి మనిషి మట్టి మనిషి గా గా ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కళాకారుడు అందెశ్రీ అకాలమరణం ను తట్టుకోలేకపోతున్నామని వారు తెలిపారు. అందెశ్రీ కి ఘనంగా నివాళులర్పించారు.