5 July, 2026 | 12:14 PM

ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

12-06-2024 12:25 AM

పటాన్‌చెరు, జూన్ 11: జిన్నారం మండ లం బొల్లారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే రాజ య్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  కోరారు. మంగళవారం ఖాజీపల్లిలో నిర్వహించిన జిన్నారం సీఐటీయూ పారిశ్రామిక క్లస్టర్ సమావేశానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొల్లా రం, ఖాజీపల్లి, బొంతపల్లి పారిశ్రామికవాడల సమస్యలను ప్రభుత్వాలు పరిష్క రించాలని కోరారు. సుమారు 30 సంవత్సరాల క్రితం ఈఎస్‌ఐని ఏర్పాటు చేశారని, బొల్లారంలో వంద పడకల  ఆసుపత్రిగా, బొంతపల్లిలో 25 పడకల ఆసుపత్రిగా ఈఎస్‌ఐని అప్‌గ్రేడ్  చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెరిగిన పరిశ్రమలు, కార్మికులకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలన్నారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పారిశ్రామిక వాడల్లో ఫైర్ స్టేషన్‌లు లేకపోవడం వలన ప్రమాదాలు జరిగినప్పుడు జీడిమెట్ల, నర్సాపూర్ నుంచి ఫైర్ ఇంజన్‌లు వచ్చేలోపు కోట్ల ఆస్తులు అగ్నికి ఆహుతి అవుతుండడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. పారిశ్రామికవాడల్లో సీసీ రోడ్లు వేయాలని, పరిశ్రమలకు మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో శ్రీధర్‌రావు, భాస్కర్ రెడ్డి, శేఖర్, హుస్సేన్, నరసింహ గౌడ్, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.