calender_icon.png 15 June, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్ వాడి బడిబాట

12-06-2025 10:33:24 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో గురువారం అంగన్వాడి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  రామన్నపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి వెంకటరమణ(ICDS Project Officer Venkataramana) మాట్లాడుతూ... మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరినీ ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ఆమె కోరారు. అదేవిధంగా అంగన్వాడీలో చిన్నారులకు ఆటపాటలతో పాటు విద్యను అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.

అలాగే చిన్నారులకు కేంద్రాలలో పౌష్టికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని అంగన్వాడీలకు పంపడం ద్వారా పిల్లల ఎదుగుదల దృఢంగా ఉంటారని ఆమె అన్నారు. ప్రతి అంగన్వాడి సెంటర్లలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల చిన్నారులకు గర్భవతులకు కల్తీ లేని ఆకుకూరలు, కూరగాయలు అందించవచ్చని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె కిచెన్ గార్డెన్ లో విత్తనాలను నాటారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునీత, తల్లులు ప్రసన్న, అండాలు, స్వాతి, శ్వేత, సోనీ, లక్ష్మి, పద్మ, ఆయా పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.