9 April, 2026 | 2:01 AM

అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసి వేధింపు!

09-04-2026 12:05 AM
  1. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  2. కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో ఘటన

కంగ్టి, ఏప్రిల్ 8(విజయక్రాంతి): అంగన్ వాడీ టీచర్‌ను  చెట్టుకు కట్టేసి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో బుధవారం జరిగింది చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వసంత కుమారి వద్దకు ఇదే గ్రామానికి చెందిన అవుటి బండెప్ప, కోటగిరి రాములు, భూతా ల వైద్యనాథ్, అవుటె సాయవ్వ, చాకలి బాలమణి అనే వ్యక్తులు వచ్చి నీ భర్త ఇన్సూరెన్స్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆమెను చెట్టుకు కట్టేశారు.తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.