2 July, 2026 | 11:33 PM

క్వార్టర్స్‌కు అంకుషితా

30-05-2024 01:18 AM

బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హతగా భావిస్తున్న వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయర్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మహిళల 60 కేజీల విభాగంలో అంకుషితా బోరో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అంకుషితా 4 రిమ్మా వొలొసెన్కో (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. ఇక పురుషుల 71 కేజీల విభాగంలో నిషాంత్ దేవ్ 5 యెసంగ్‌నోయెన్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. పారిస్ టికెట్ దక్కించుకునేందుకు ఈ ఇద్దరు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నారు.