28 August, 2026 | 2:02 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

నీరజ్‌తో డీకే

30-05-2024 01:21 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాను బుధవారం టీమిండియా సీనియర్ దినేశ్ కార్తీక్ (డీకే) కలుసుకున్నాడు. ఇద్దరు కలిసి చాలా విషయాలు చర్చించుకున్నారు. అనంతరం నీరజ్ జావెలిన్‌ను 25 మీటర్ల దూరానికి త్రో చేయాలంటూ డీకేకు సవాల్ విసిరాడు. నీరజ్ చాలెంజ్‌ను అంగీకరించిన కార్తీక్ తొలి ప్రయత్నంలో జావెలిన్ త్రో చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో మాత్రం 25 మీటర్లు వేసినప్పటికి లైన్ టచ్ చేయడంతో ఫౌల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒలింపిక్స్‌కు సిద్ధమవు తున్న నీరజ్ ఇటీవలే ఫెడరేషన్ కప్‌లో జావెలిన్‌ను 82.27 మీటర్లు విసిరి పసిడి  గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్  పారిస్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.