3 July, 2026 | 12:42 AM

అంపైర్లకు హెచ్‌సీఏ వర్క్‌షాప్

30-05-2024 01:14 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ నెల 31 నుంచి అంపైర్లు, క్యూరేటర్లు, స్కోరర్లకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనుంది. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్ షాప్‌లో కొత్త నిబంధనలతో పాటు.. ఇతర నైపుణ్యాలను మరింత మెరుగుదిద్దనున్నట్లు హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. క్యూరేటర్లకు వారం రోజులు, స్కోరర్లకు రెండు రోజులు, అంపైర్లకు ఒక రోజు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్కోరర్లు, వీడియో అనలిస్టులు కూడా ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.