17 April, 2026 | 11:54 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

అంగన్వాడీ కేంద్రంలో అన్న ప్రాసన కార్యక్రమం విజయవంతం

07-02-2026 12:46 AM

శ్రీరంగాపురం ఫిబ్రవరి 6: మండల కేంద్రంలోని అంగన్వాడి 3వ కేంద్రంలో చి న్నారుల పోషకాహారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా అన్న ప్రసన్న కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ మంజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భి ణీ స్త్రీలు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పోషక విలువలు కలిగిన భోజనాన్ని అందించారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ మంజుల రాణి మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు. తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పొందారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల అంగన్వాడి కేంద్రాల పాత్ర కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.