calender_icon.png 28 October, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ రాజరాజేశ్వరునికి ఘనంగా అన్నపూజ

27-10-2025 10:55:57 PM

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వరునికి మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ఘనంగా అన్న పూజ నిర్వహించారు. దేవస్థాన అర్చకులు సతీష్ శర్మ వేదమంత్రోచరణ మధ్య గర్భగుడిలోని శివలింగానికి అన్న సమర్పణ చేశారు. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు కన్నుల నిండుగా దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద మహిళలు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి భజన బృందం సహాయక సంఘం సభ్యులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. భారీగా తరలివచ్చిన భక్తులకు మందమర్రికి చెందిన మిడివెళ్లి రాజశేఖర్ మాధురి దంపతులు అన్నదానం నిర్వహించారు.