27-10-2025 11:02:01 PM
శ్రీరాంపూర్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీకి చెందిన అయ్యప్ప భక్తుడు బోడ రామకృష్ణ మహా పాదయాత్రగా సోమవారం శభరిమలకు బయలుదేరారు. శ్రీరాంపూర్ లోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 45 రోజుల 1400 కిలోమీటర్ల శభరిమాల పాదయాత్రను అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ(ఏబీఏపీ) శ్రీరాంపూర్ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, రాష్ట్ర మీడియా ఇంచార్జి బాస్కరి రాజేశం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనమాల సత్యనారాయణ, దాసరి నవీణ్, జక్కెన రమేష్, బోడ రాజేష్, గంగాధర్, కేతిరెడ్డి భరత్ రెడ్డి, కొండి రజినీకాంత్, ఎగ్గడి వినోద్ కుమార్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.