calender_icon.png 9 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదానం మహాదానం

09-11-2025 04:30:31 PM

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని అల్లీపురం రోడ్డులో వేలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజారి బానోతు లచ్చు, ధనమ్మ దంపతుల ఆధ్వర్యంలో భోజన బృందం వారు మేళ తాళాలు వాయిద్యాలతో భక్తి గీతాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదివారం అయ్యప్ప, ఆంజనేయ, శివుడు స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానం కార్యక్రమంలో స్వాములు, భక్తులు దాదాపుగా 1000 మంది పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన స్వాములు, భక్తిపూర్వకంగా ప్రసాదం స్వీకరించారు. ఆంజనేయ స్వామి పూజారి, అన్నదాత మాట్లాడుతూ  భక్తులకు సేవా చేయడం గొప్ప పుణ్యమని భవిష్యత్తులో మరేనో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.