2 March, 2026 | 5:18 AM

అంగరంగ వైభవంగా వార్షికోత్సవం

01-03-2026 11:59 PM

అలరించిన చిన్నారుల నృత్యాలు

గుమ్మడిదల, మార్చి 1 : అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారులు దేవలోకంలోని దేవకన్యల వేషధారణలతో నృత్యాలు చేయడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆనందోత్సవాలల్లో మునిగిపోయారు. మున్సిపల్ పరిధిలోని శ్రీ వివేకానంద స్మార్ట్ కిడ్స్ ఉన్నత పాఠశాల గుమ్మడిదల, ఆచార్యాద స్కూల్ అన్నారం పాఠశాలల యాజమాన్యం కరస్పాండెంట్ చిమ్ముల జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ చిమ్ముల లతా రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ చిమ్ముల మల్లారెడ్డి, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల ఆధ్వర్యంలో వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి లతోపాటు కౌన్సిలర్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చిన్నారులు ప్రదర్శించిన కళాప్రదర్శనలు మంత్రముగ్ధులను చేసిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.