24 March, 2026 | 7:02 AM

కాళ్లు మొక్కి.. ఆపై కాల్పులు జరిపి..

02-11-2024 12:17 AM

ఢిల్లీలో దీపావళి రోజున ఇద్దరి హత్య

న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ దుండగుడి కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందారు. గురువారం పండుగను పురస్కరించుకొని ఢిల్లీలోని షాహదారాలోని ఫార్ష్ బజార్‌లో ఆకా శ్‌శర్మ (44) అనే వ్యక్తి తన మేనల్లుడు రిషబ్ శర్మ (16), కుమారుడు క్రిష్ శర్మ (15)తో కలిసి ఇంటి ముందు పటాకులు కాలుస్తున్నాడు. అప్పుడే బైక్‌పై ఇద్దరు వ్యక్తులు శర్మ ఇంటి వద్ద తిరుగుతున్నారు. ఆకాశ్‌శర్మ గేటు తీసుకొని ఇంట్లోకి వెళ్తుండగా నిందితుల్లో ఒకడు ఆకాశ్ కాళ్లకు నమస్కారం చేసి 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో గేటు దగ్గరే ఆకాశ్ కుప్పకూలాడు. పారిపోతున్న నిందితులను మేనల్లుడు రిష బ్‌శర్మ పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిపైనా కాల్పులు జరపడంతో రిషబ్ కూడా చనిపోయాడు. కుమారుడు క్రిష్ శర్మకు గా యాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కాగా దూరపు బంధువైన యువకుడు ఆకాశ్‌శర్మకు నెల రోజుల క్రితం రూ.70,000 అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.