1 August, 2026 | 1:55 AM

ఎస్‌ఐఆర్ ప్రవాస్ అభియాన్ పాల్గొన్న ఎమ్మెల్యే

01-08-2026 01:06 AM

భైంసా ,జూలై 31 (విజయక్రాంతి): భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసి కార్యకర్తగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి పైడిపెల్లి గంగాధర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నగర కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్ర ప్రభారీలు, పార్టీ పదాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడం, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.