12 July, 2026 | 8:05 PM

తెలుగుతెరపై మరో ప్రేమకథ వారధి

13-12-2024 12:00 AM

తెలుగు తెరపై ‘వారధి’ పేరిట మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. అనిల్ ఆర్కా, విహారికా చౌదరి ప్రధాన పా త్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎండీ యూ నస్ ‘వారధి’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ సె న్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ/యూ సర్టిఫికెట్ జా రీ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ.. “ఈ కథలో లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులందరికీ నచ్చే కథను అందించామనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ సినిమా సాం కేతిక నిపుణుల కృషి, కథా కథనాల ప్ర త్యేకత, నటీనటుల అభినయం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘వారధి’లో ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశామని చిత్ర యూనిట్ వెల్లడిం చింది.