12 July, 2026 | 9:02 PM

కొత్త కాన్సెప్ట్‌తో..

13-12-2024 12:00 AM

హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న  సినిమా ‘ఫియర్’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై నిర్మాతలు డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ‘ఫియర్’ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ పాత్రలో కనిపించనున్నారు. ‘ఫియర్’ సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గురువారం ‘ఫియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హరిత గోగినేని మాట్లాడుతూ..- ‘ఫియర్’ స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. ఒక కొత్త కాన్సెప్ట్‌తో వెళ్తుంది. సరికొత్త స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.  ‘ఫియర్’లో వేదిక డ్యూయల్ రోల్ చేసిందనే విషయాన్ని ఈ ఈవెంట్‌లో రివీల్ చేస్తున్నాం” అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ..- “హరిత, అభి గతంలో లక్కీ లక్ష్మ ణ్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి వాళ్లను చూస్తున్నా. వీళ్లు ‘ఫియర్’ సినిమా స్టార్ట్ చేస్తున్నారని తెలిసి హ్యపీగా ఫీలయ్యా” అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, హీరో సొహైల్, నిర్మాత ఏఆర్ అభి, సహ నిర్మాత సుజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.