16 July, 2026 | 10:28 AM

ప్రారంభోత్సవానికి హాలీవుడ్ అతిథులు

06-12-2024 12:00 AM

మహేశ్‌బాబు కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సిని మా ఇంకా ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహే శ్‌బాబు ప్రస్తుతం ఈ సినిమా కోసం మేకో వర్ అవుతున్నారు. రాజమౌళి కూడా చాలా రోజులుగా ఈ చిత్రం పూర్వ నిర్మాణ పను ల్లోనే నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారాయన. మూవీ టీమ్ హైదరాబాద్‌లో భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ ఈ సెట్స్‌లోనే జరగనుందని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమా ప్రారంభోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి పేరు ఇప్పటికే గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది కాబట్టి మూవీ లాంచ్‌ను కూడా అదే స్థాయిలో చేయాలని చూస్తు న్నారట. ఈ కారణంగానే చిత్ర ప్రారం భోత్సవ కార్యక్రమం లో అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు సందడి చేయను న్నారని ప్రచారం ఫిల్మ్ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఎస్‌ఎస్‌ఎం బీ29’ ప్రారంభో త్సవ అతిథుల జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడు తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ సాధించిన సందర్భంలో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్.. రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారని అంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ సినిమా రేంజ్ మరో మెట్టు ఎక్కినట్టే అన్న అభిప్రాయాన్ని క్రిటిక్స్ వ్యక్తం చేస్తున్నారు.