హైదరాబాద్‌లో మరో కొత్త జీసీసీ
ముందుకొచ్చిన రీజెనరాన్
అమెరికా వెలుపల తొలి జీసీసీ కేంద్రం తెలంగాణలోనే
ఐటీ, డేటా సైన్స్, ఏఐ రంగాల్లో ఉద్యోగావకాశాలు
జీసీసీ కేంద్రాల ఏర్పాటులో రెండో స్థానంలో హైదరాబాద్
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): గ్లోబల్ లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ దిగ్గజమైన ‘రీజెనరాన్’ సంస్థ తన సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. అమెరికా వెలుపల ఈ ప్రతిష్ఠా త్మక సంస్థ ఏర్పాటుచేస్తున్న మొట్టమొదటి జీసీసీ కేంద్రం ఇక్కడే కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయిని వెల్లడించారు. జీసీసీల రాక తో ఇక్కడి ఐటీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
న్యూయా ర్క్‌లోని ట్యారిటౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆయన సం తోషం వ్యక్తంచేశారు. రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెజెనరాన్‌కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్ప్తి కేంద్రాలు ఉన్నప్పటికీ, హైద రాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రం ప్రత్యేకమైన గ్లోబల్ హబ్‌గా పనిచేస్తుందని తెలి పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నత స్థాయి డిజిటల్ సేవలను అందిస్తుందని చెప్పారు.
హైదరాబాద్‌లో 450 సెంటర్లు..
ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 450 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పనిచేస్తుండగా, మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబ డులకు ముందుకు వస్తున్నాయని శ్రీధర్‌బా బు తెలిపారు. జీసీసీల కేంద్రంగా ముంబా యి, ఢిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీల రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశోధన, తయారీరంగం, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీ విస్తరణ, త్వరలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మా సిటీ వంటివి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఈ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్య లో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచంలో ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థల్లో ఒకటైన రెజెనరాన్ ఇప్పటికే అనేక ఔషధాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సేవలు అంది స్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారి కోవాల్, రెజెనరాన్ జీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఓనాట్, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.






