‘మీసేవ’లో మరో కొత్త సర్వీస్
ఎస్‌ఎస్‌సీ మెమో ప్రింట్ తీసుకునే సదుపాయం
మహబూబాబాద్, జూలై 4 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా పౌరులకు ముఖ్యమైన సేవను మీసేవ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. పదో తరగతి మెమోను కోల్పో యిన లేదా పోగొట్టుకున్న విద్యార్థులు ఇకపై తమ మార్కులతో కూడిన ఈ - మెమోను మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా పొందవచ్చని ములుగు ఈ డిస్ట్రిక్ట్ మేనే జర్ దేవేందర్ తెలిపారు.
ఈఎస్‌డీ మీసేవ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2004 నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఈ -మెమో లను మీసేవ ద్వారా ప్రింట్ తీసుకునే సౌకర్యా న్ని ప్రభుత్వం కల్పించినట్లు ఆయన వివరించారు. దరఖాస్తుదారు లు తమ ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్, పరీక్ష పూర్తయిన సంవత్సరం వివరాలను అందజేస్తే, వెంటనే మీసేవ స్టేషనరీపై అధికారిక ఎస్‌ఎస్‌సీ ఈ మెమో ప్రింట్ అందజేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.62లు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.






